![]()
గుండాల, మన భద్రాద్రి న్యూస్, జూలై 21
మండల పరిధిలోని సాయనపల్లి గ్రామ సమీప కిన్నెరసాని వాగు నుండి సోమవారం అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారన్న సమాచారంతో స్థానిక ఎస్సై సైదా రఫూఫ్ తన సిబ్బందితో కలిసి ఇసుక ట్రాక్టర్ ను పట్టుకుని, పోలీస్ స్టేషన్ కు తరలించి, సీజ్ చేశారు. ఎవరైనా అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను రవాణా చేస్తే వాహనాలను సీజ్ చేసి, కేసులు నమోదు చేస్తామని ఎస్సై ఈ సందర్భంగా హెచ్చరించారు.


