Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemఅన్ని రకాల వరికి 500 రూపాయలు బోనసు చెల్లించాలి

అన్ని రకాల వరికి 500 రూపాయలు బోనసు చెల్లించాలి

Loading

-ఎరువులు, విత్తనాలను సకాలంలో సరఫరా చేయాలి

-ఏఐకేఎంఎస్ డిమాండ్

టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్, మే 21

అఖిలభారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రైతాంగానికి అన్ని రకాల వరి ధాన్యానికి ఐదు వందల రూపాయల బోనసును చెల్లించాలని, అదేవిధంగా రైతులకు ఎరువులు, విత్తనాలను సకాలంలో సరఫరా చేయాలని, అన్ని రకాల రుణాలను మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని మంగళవారం డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం మండల అధ్యక్షులు గుగులోతు రామచందర్, సిపిఐ ఎంఎల్ (న్యూడెమోక్రసీ) మండల కార్యదర్శి కల్తీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రైతాంగం పండించిన అన్ని రకాల వరి ధాన్యం కు ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం బోనస్ చెల్లించాలని కోరారు. రైతులకు వ్యవసాయ సీజను ప్రారంభం అవుతున్న సమయంలో సకాలంలో ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు అందించాలని కోరారు. రైతుల అన్ని రకాల రుణాలను మాఫీ చేయాలని, కొత్త రుణాలు ఇవ్వాలని, కుటుంబాన్ని బేసిక్ గా కాకుండా కుటుంబంలో తీసుకున్న ప్రతీ వారికి రుణం మాఫీ చేయాలని కోరారు. ప్రభుత్వం కుటుంబాన్ని బేసిగ్గా తీసుకొని ఒక్కరికే రుణమాఫీ చేస్తామని అంటున్నారని, రుణం తీసుకున్న ప్రతి రైతుకు మాఫీ వర్తించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల రైతాంగానికి ఇచ్చిన హామీ అమలుకై రైతాంగ ఉద్యమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు డి ప్రసాద్, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు ధరావత్ వెంకన్న, బానోత్ వెంకట్రాం, గుగులోత్ చంద్య, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page