Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemఅశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం

అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం

Loading

అశ్వారావుపేట, మన భద్రాద్రి న్యూస్, జులై 01

అశ్వారావుపేట ఎస్సైగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీరాముల శ్రీనివాస్ సోమవారం మహబూబాబాద్ లోని వ్యవసాయ శాఖ మార్కెట్ సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పరిస్థితి విషమించడంతో వరంగల్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఎస్సై శ్రీనివాస్ స్వస్థలం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామం. గత కొతంకాలంగా ఎస్సై శ్రీనివాస్ పై అవినీతి ఆరోపణలకు సంబంధించి ఉన్నతాధికారులకు వరుస ఫిర్యాదులు అందుతున్నట్లు సమాచారం. అంతర్గత విచారణకు అధికారులు ఆదేశించినట్లు ప్రచారం జరుగుతుంది. ఆదివారం ఉదయం నుంచి ఎస్సై విధులకు దూరంగా ఉంటూ, తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు భావిస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఎస్సై ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను పోలీస్ శాఖ ఉన్నతాధికారులు గోప్యంగా ఉంచుతున్నట్లు సమాచారం. ఎస్సై ఆత్మహత్యాయత్నానికి కారణం అవినీతి ఆరోపణలా లేక అధికారుల వేధింపులా, వ్యక్తిగత సమస్యలా అనే విషయాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page