![]()
- ఆధార్ సెంటర్లను ప్రారంభించాలి
- మణుగూరు తహసీల్దార్ ను కోరిన లాయర్ కర్నె రవి
మణుగూరు, మన భద్రాద్రి న్యూస్, జులై 03
మణుగూరు మండలంలో ఆధార్ కేంద్రాలు లేక ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సామాజిక కార్యకర్త కర్నె రవి తెలిపారు. విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పెన్షన్ దారులు, రైతులు, సామాన్య ప్రజానీకం మండలంలో ఉన్న ఒకే ఒక ఆధార్ సెంటర్ నాలుగు నెలల నుంచి మూసివేయడం జరిగింది ఆదార్ సెంటర్ లేక అశ్వాపురం, పినపాక మండలాలు చుట్టూ తిరగలేక సతమవుతున్నారని, ఈ విషయమై చొరవ చూపి తక్షణమే మీ సేవ కేంద్రాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన మణుగూరు తహసిల్దార్ రాఘవరెడ్డికి వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన తహసిల్దార్, విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.


