![]()
-నిరుపేద కుటుంబం దీనంగా వేడుకోలు
అశ్వాపురం, మన భద్రాద్రి న్యూస్, జులై 02
మండలంలోని మొండికుంట గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబ దీనగాథ ఇది. దండి లింగయ్య మొదటి నుండి వ్యవసాయ కూలీ పనులకు వెళ్లేవాడు. రెక్కాడితేనే డొక్క నిండే పరిస్థితి ఆ కుటుంబానిది. లింగయ్య దంపతులకు ఇద్దరు అమ్మాయిలే, దంపతులిద్దరూ కూలీ నాలీ చేసి, కొద్ది మొత్తంలో అప్పులు చేసి ఇద్దరమ్మాయిలకు తమకు ఉన్నంతలో వివాహాలు జరిపించారు. ఇద్దరమ్మాయిల పెళ్లిలు చేశామని ఊపిరి పీల్చుకొని సంతోషపడేలోపే ఆ ఇంటి యజమాని లింగయ్యకు పక్షవాతం, గుండె జబ్బు రూపంలో ఆ కుటుంబాన్ని వీధి వక్రీకరించింది. కూలీకి వెళ్లి కుటుంబాన్ని నడిపించే వ్యక్తి మంచాన పడడంతో ఆ కుటుంబానికి పెద్ద కష్టం వచ్చి పడింది. అసలే నిరుపేద కుటుంబం కావడంతో లక్షలు పెట్టి వైద్యం చేయించలేక మంచానికి పరిమితమైన భర్తను కళ్ళ ముందు చూసుకుంటూ కుమిలిపోతున్న లింగయ్య భార్య బాధ వర్ణనాతీతం. నిస్సహాయ స్థితిలో సహాయం కోసం ఆ కుటుంబం దాతల కోసం ఎదురుచూస్తుంది. మానవత్వంతో మీరు అందించే చిన్న సహాయం ఆ కుటుంబానికి దిక్కు చూపినవారు అవుతారు. సహాయం అందించే దాతలు ఫోన్ పే నంబర్ 8688359072 గానీ, అకౌంట్ నంబర్ 73018472972 ద్వారా సహాయం అందించి తన భర్తను కాపాడండని ఆ అర్ధాంగి వేయి కళ్ళతో దీనంగా ఎదురుచూస్తుంది.


