![]()
ఇల్లందు, మన భద్రాద్రి న్యూస్
ఆయుర్వేదంతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. ఆదివారం కరెంట్ ఆఫీస్ సెంటర్ ఖమ్మం రోడ్డు నందు సహజ ఆయుర్వేద వైద్యశాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నయం కాని మొండి రోగాలు కూడా ఆయుర్వేదంతో నయమవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, నియోజకవర్గ నాయకులు మాజీ వైస్ ఎంపీపీ మండల రాము, మండల లీడర్ పూణెం సురేందర్, డి శివకుమార్, కాకాటి భార్గవ్, ప్రసన్న, ఆఫ్రిద్, ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.


