![]()
మన భద్రాద్రి వెబ్ డెస్క్: ఇరాన్- ఇజ్రాయెల్ (Iran-Israel) మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) టెల్‌అవీవ్‌ను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
తమ సాయం లేకుండా ఫోర్డ్‌లోని భూగర్భ అణుకేంద్రాన్ని నాశనం చేసే సామర్థ్యం ఇజ్రాయెల్‌కు లేదన్నారు. శుక్రవారం (స్థానిక కాలమానం ప్రకారం) న్యూజెర్సీలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.సై అంటే సైఇజ్రాయెల్ ఇప్పటివరకు జరిపిన దాడుల్లో గణనీయమైన ప్రయోజనాలు సాధించిందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, అమెరికా (USA) సాయం లేకుండా ఇరాన్‌కు చెందిన ఫోర్డ్ భూగర్భ అణుకేంద్రాన్ని నాశనం చేసే సామర్థ్యం టెల్‌అవీవ్‌కు లేదు. ఒకవేళ వారు దాడులు చేసినా అది పెద్ద ప్రభావం చూపించవన్నారు. వారికి ఆ సామర్థ్యం లేదన్నారు. ఈసందర్భంగా తాను దౌత్యానికి కట్టుబడి ఉన్నానని చెప్పిన ఆయన.. సైనిక కార్యకలాపాలను ఆపేయాలని ఇజ్రాయెల్‌ను ఒప్పించడం ప్రస్తుతానికి అసంభవమన్నారు. ఎవరైనా గెలుస్తుంటే ఇలాంటి అభ్యర్థనలు చేయడం కష్టమని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో యుద్ధంలో టెల్అవీవ్ అద్భుతమైన దాడులు చేస్తుండగా.. టెహ్రాన్వి పేలవంగా ఉన్నాయన్నారు. ఇదిలాఉండగా.. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి యూరోపియన్ దేశాలు చేస్తున్న ప్రయత్నాలను ట్రంప్ తోసిపుచ్చారు. వారు సాయం చేయలేరని వ్యాఖ్యానించారు. ఇరాన్ యూరప్‌తో కాకుండా అమెరికాతో చర్చలు జరపాలనుకుంటున్నారని వెల్లడించారు.


