![]()
-విద్యుత్ నియంత్రణ మండలి
ఆంధ్రప్రదేశ్, మన భద్రాద్రి న్యూస్, మార్చి 12
విద్యుత్ వినియోగదారులకు తీపి వార్త.కరెంటు ఛార్జిలను ఈ ఏడాది పెంచడం లేదని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి తెలిపింది.గతేడాది విద్యుత్ ఛార్జిలలో ఎలాంటి పెంపు లేకుండా 2024-2025 సంవత్సరం టారిఫ్ ను విడుదల చేసింది.ఈ నిర్ణయంతో 2 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందనున్నారు.రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్, ఇతర రాయితీలు అలాగే కొనసాగనున్నాయి.మొత్తంగా ప్రభుత్వం రూ. 13,589 కోట్ల సబ్సిడీని భరించనుంది.రైల్వే శాఖకు మాత్రం యూనిట్ కి 1 రూపాయి పెంచారు.


