![]()
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్, మే 18
ఉపాధి హామీ కూలీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం భారత కార్మిక సంఘాల సమైక్య (ఐ ఎఫ్ టి యు), అఖిలభారత రైతుకూలీ సంఘం (ఏఈ కె ఎం ఎస్) జిల్లా కమిటీల పిలుపులో భాగంగా ఎంపీడీవోకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఐ ఎఫ్ టి యు రాష్ట్ర నాయకులు డి ప్రసాద్, అఖిలభారత రైతు కూలీ సంఘం మండల అధ్యక్షులు గుగులోతు రామచందర్ మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు కొలతలతో సంబంధం లేకుండా రోజుకు 750 రూపాయలు చెల్లించాలని, పనిముట్లను సమకూర్చాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశంలో కనీస వసతులు కల్పించాలని కోరారు. గత నెల రోజుల నుండి పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలకు వారి అకౌంట్లో జమ కాని డబ్బులను వెంటనే వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి కల్తీ వెంకటేశ్వర్లు, కోడం రాజు, జరుపల లక్ష్మ, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.


