Tuesday, March 24, 2026
HomeTelangana Newsఉప్పల్​ స్టేడియంలో 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు

ఉప్పల్​ స్టేడియంలో 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు

Loading

ఉప్పల్​ స్టేడియంలో 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు

  • రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు

హైదరాబాద్, మన భద్రాద్రి బ్యూరో, జనవరి 24

ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ కు కట్టదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్టు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. 1500 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యలకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మ్యాచ్ ముగిసిన అనంతరం ప్రజలు పోలీసులు సూచించిన మార్గాల్లోనే వెళ్లాలన్నారు. ఎవరైనా బ్లాకులో టికెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 360 సీసీ కెమెరాలతో నిఘా పెట్టినట్టు ఆయన చెప్పారు. మ్యాచ్ మధ్యలో ఎవరూ స్టేడియంలోకి రావద్దని సూచించారు. వాహనాల పార్కింగ్​కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, లాప్ టాప్స్, లైటర్స్, హెల్మెట్స్, పవర్ బ్యాంక్స్, అవుట్ సైడ్ ఫుడ్ స్టేడియంలోకి అనుమతి లేదని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page