![]()
మన భద్రాద్రి వెబ్ డెస్క్: వర్షాలకు కృష్ణా, గోదావరి నదుల ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. శ్రీశైలం జలాశయాం నుంచి నాగార్జున సాగర్‌కు వరద ప్రవాహం పెరుగుతోంది. లక్షా 20వేల క్యూసెక్కుల వరద సాగర్‌కు వచ్చి చేరుతోంది. 32వేల 638క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. ప్రస్తుతం 580.20 అడుగులకు నీటి మట్టం చేరింది. 283. 5924 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక జూరాలలో వరద కొనసాగుతుండటంతో ఐదు గేట్లు ఎత్తి 95వేల 416 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం 317.390మీటర్ల నీటి మట్టం,7.444 టీఎంసీలు నీటి నిల్వ ఉంది. కాళేశ్వరం వద్ద వరద ఉధృతి పెరిగింది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద ఔట్ ఫ్లో 3 లక్షల 41 వేల క్యూసెక్కులుగా ఉంది. 85గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నీటిమట్టం 8.700 మీటర్లుగా ఉంది. సరస్వతి ఘాట్, మెయిన్ పుష్కరఘాట్లను వరద ప్రవాహం తాకుతోంది.
- 5 రోజుల నుంచి ఖమ్మంలో విస్తారంగా వర్షాలు..
ఖమ్మంలో ఐదు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకుంటున్న తరుణంలో అధికారులు అప్రమత్తమయ్యారు. రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేస్తూ హెచ్చరిక బోర్డులు సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకైతే వరద ముప్పు లేదన్నారు కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి. వరదను అంచనా వేస్తూ NDRF, SDRF టీంల నుంచి 24 మంది చొప్పున మొత్తం 48 మందిని, 8 బోట్లను సిద్ధం చేశామన్నారు. మహబూబాబాద్ నంచి చెరువుల మ్యాపింగ్ ఏర్పాటు చేశామన్నారు. వరద వచ్చినా… రెండు గంటల ముందే తెలుస్తుందన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు.


