![]()
గుండాల/ఆళ్లపల్లి, మన భద్రాద్రి న్యూస్, జూన్ 07
గుండాల మరియు ఆళ్లపల్లి మండలాలలో శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 01 గంట వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు ఉమ్మడి మండలాల ఏఈ (ఆపరేషన్స్) రమేష్ బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 33 కేవి మామకన్ను ఫీడర్ పై మరమ్మత్తులు ఉన్నందున గుండాల మరియు ఆళ్లపల్లి మండలాలలో విద్యుత్ సరఫరా నిలిపి వేయబడునని, కావున విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించగలరని ఈ సందర్భంగా ఆయన కోరారు.


