Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemఎంపీపీఎస్ లో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం

ఎంపీపీఎస్ లో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం

Loading

గుండాల, మన భద్రాద్రి న్యూస్, జూన్ 17

మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల నందు ఒకటవ తరగతిలో ఈ విద్యా సంవత్సరానికి కొత్తగా పదిహేను మంది విద్యనభ్యసించడానికి చేరిన చిన్నారి విద్యార్థినీ, విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్ ఆధ్వర్యంలో ఆ పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు ఘనంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. బడి బాట కార్యక్రమంలో ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు కొత్తగా ఇరువై మంది విద్యార్థులు చేరినట్లు, ఇంకో ఇరువై మంది విద్యార్థులు తమ పాఠశాలలో చేరనున్నట్లు ప్రధానోపాధ్యాయులు రమేష్ తెలిపారు. ఈ సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు శరత్ బాబు, రాజ్యలక్ష్మి, ప్రమీల, వెన్నెల, చిన్నారుల తల్లిదండ్రులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page