![]()
-ఎంపీపీ ముక్తి సత్యం, జడ్పీటీసీ వాగబోయిన రామక్క, మాజీ సర్పంచ్ కోరం సీతారాములు
గుండాల, మన భద్రాద్రి న్యూస్, మే 17
మండల పరిధిలోని పోతిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబమైన అంగవైకల్యం కలిగిన ఎట్టి అబ్బయ్య ఇల్లు గురువారం రాత్రి కురిసిన వర్షానికి పూర్తిగా నేలమట్టమైంది. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబమని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. నెలసరి పింఛన్ తో జీవనం గడుపుతున్న అబ్బయ్య కుటుంబాన్ని ప్రభుత్వమే బాధ్యతాయుతంగా ఆదుకోవాలని గుండాల మండల ప్రజా ప్రతినిధులు ఎంపీపీ ముక్తి సత్యం, జడ్పీటీసీ వాగబోయిన రామక్క, మాజీ సర్పంచ్ కోరం సీతారాములు కోరారు.


