![]()
పినపాక, మన భద్రాద్రి న్యూస్
పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్ల ఆదేశాలతో అధికారులు సోమవారం మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో వంట షెడ్డులో మరమత్తు పనులు పూర్తి చేపట్టారు. గత సోమవారం ఎమ్మెల్యే పాయం మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించారు. ఆ సమయంలో పాఠశాలలోని వంట షెడ్డు కృంగిపోయి ఉండటంతో అక్కడే ఉన్న ఎల్చిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్, ఏఈ విజయకృష్ణలను మరమ్మత్తులు చేయాలని ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉడుముల రవీందర్ రెడ్డి వెంటనే పనులు ప్రారంభించి పూర్తి చేయించారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.


