![]()
ఎమ్మెల్యే పాయాన్ని పరామర్శించిన జర్నలిస్టులు
మణుగూరు, మన భద్రాద్రి న్యూస్,
పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాతృమూర్తి పాయం రాములమ్మ ఈ నెల 17న పరమపదించారు. ఈ విషయం తెలుసుకున్న నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు బోగా ఓదెలు, కనుకు రమేష్, సభ్యులు వేమూరి రాఘవేంద్రరావు, నిట్టా అమృతరావు శనివారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నివాసానికి వెళ్లి పరామర్శించి ఆమెకు నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.


