![]()
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్, మే 31
మండల కేంద్రంలో ఉన్న ఎరువులు, పురుగుల మందుల దుకాణాలలో శుక్రవారం వ్యవసాయ శాఖ అధికారి ఏడిఏ పి వాసవి రాణి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి మాట్లాడుతూ దుకాణాలలో విత్తనాలు, ఎరువులను రైతులకు విక్రయిస్తున్నప్పుడు ఒరిజినల్ రసీదును ఇవ్వాలని దుకాణాదారులను ఆదేశించారు. ప్రభుత్వంచే అనుమతులను పొందిన విత్తనాలను మాత్రమే విక్రయించాలని తెలిపారు. విత్తనాలు ఒకే రకం కాకుండా అన్ని రకాల విత్తనాలు రైతులకు ఇవ్వాలని, విత్తనాలు దొరకవని రైతులను మభ్య పెట్టొద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ ఏఓ అన్నపూర్ణ, ఏఈవో రమేష్, రెహనా, తదితరులు పాల్గొన్నారు.


