Tuesday, March 24, 2026
HomeAndhra Pradeshఏపీ అసెంబ్లీలో జగన్‌పై నారా లోకేశ్ హాట్ కామెంట్స్

ఏపీ అసెంబ్లీలో జగన్‌పై నారా లోకేశ్ హాట్ కామెంట్స్

Loading

ఆంధ్రప్రదేశ్, మన భద్రాద్రి వెబ్‌డెస్క్, మార్చి 05

చట్టాన్ని ఉల్లంఘించడం మాజీ సీఎం జగన్‌కు అలవాటేనని మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. ఇవాళ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాపై ఆయన మాట్లాడుతూ జగన్‌కు ప్రతిపక్ష హోదా రాదని చట్టం చెబుతోందని అన్నారు. ఆ చట్టాన్ని ఉల్లంఘించి హోదా ఇవ్వమని అడగటం హస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. నిబంధనల ప్రకారం జగన్‌ కు జెడ్ ప్లస్ హోదా ఇచ్చామని సందర్భంగా ఆయన గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం వవన్ కల్యాణ్ కంటే జగన్‌కే ఎక్కువ భద్రత ఉందని కామెంట్ చేశారు.

ప్రతిపక్ష హోదాపై లోక్‌సభ రూల్ బుక్‌ లో క్లియర్‌గా ఉందని, గతంలో జగన్ కూడా ప్రతిపక్ష హోదాపై ఇదే సభలో క్లారిటీ ఇచ్చారని అన్నారు. నేడు మళ్లీ జగన్ తమ ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా ప్రతిపక్ష హోదాపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై సభా హక్కుల ఉల్లంఘటన నోటీసులు ఇవ్వాలని లోకేశ్ డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page