![]()
ఏ సర్పంచ్ అభ్యర్థికి మేము మద్దతు ప్రకటించలేదు
జేఏసీ కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం
ఆదివాసి జేఏసీ చైర్మన్ కోరం సూర్యనారాయణ
చర్ల,మన భద్రాద్రి న్యూస్, డిసెంబర్ 2: స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం జోరందుకుంది. మీ మద్దతు మాకే అంటే మాకే అంటూ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. మండలంలోని ఆదివాసి జేఏసీ మద్దతు తమకే అని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి, లేదు తమకే అని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆదివాసి జేఏసీ కమిటీ చైర్మన్ కోరం సూర్యనారాయణ స్పందించారు. ఈ మేరకు ఓ ప్రకటనలో ఆయన ఆదివాసి జేఏసీ కమిటీ ఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించలేదని, కమిటీ నిర్ణయం లేకుండా మద్దతు ప్రకటించబోదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని పూజారి సామ్రాజ్యం, బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని సోయం కృష్ణవేణి లకు తమ మద్దతు ప్రకటించలేదని జేఏసీ కమిటీకి సంబంధంలేని వ్యక్తులు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని అటు నిర్ణయాలను జేఏసీ వ్యతిరేకిస్తుందని ప్రకటనలో పేర్కొన్నారు. ఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించాలి అనే విషయాన్ని జెఎసి కమిటీతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని అట్టి నిర్ణయాన్ని ప్రశ్నలు ద్వారా ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు. అలాగే మండల పరిధిలోని లింగాపురం పంచాయతీ, కొత్తపల్లి పంచాయతీ పరిధిలో ఆదివాసీల పేరు చెప్పుకొని కొంతమంది అభ్యర్థులు ఆదివాసీ నకిలీ సర్టిఫికెట్లతో నామినేషన్ వేయడం జరిగిందని ఇట్టి విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్ళామని అట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకో బడతాయని అన్నారు


