![]()
ఐఎన్టీయుసి వెంటే మేమంతా..!
- ఐఎన్టీయుసి మిత్రపక్షాలకు వెల్లువెత్తిన కార్మికుల మద్దతు
- “కరపత్రాల పంపిణీ” కార్యక్రమానికి భారీగా హాజరైన కార్మికులు
- “మార్పు కావాలి.. ఐఎన్టీయూసీ రావాలి”, “అహంకారం పోవాలి.. ఐఎన్టీయుసి రావాలి” నినాదాలతో హోరెత్తిన ఐటీసీ ప్రాంగణం
- స్వచ్ఛందంగా పలు కార్యక్రమాలకు హాజరవుతున్న కార్మికులు
- “ఐఎన్టీయుసి” కి కార్మికుల మద్దతు చూసి ప్రత్యర్థుల గుండెల్లో పరుగెడుతున్న రైళ్లు
- “త్రాసు గుర్తు” పై ఓటు వేసి ఐఎన్టీయుసి ని భారీ మెజార్టీతో గెలిపించాలని కార్మికులకు విన్నవించిన అధ్యక్ష, కార్యదర్శులు
బూర్గంపహాడ్, మన భద్రాద్రి బ్యూరో
సారపాక ఐటిసి పరిశ్రమలో గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఎన్నికల తేదీ సమీపిస్తుండడంతో పోటీలో నిలిచిన కార్మిక సంఘాలు తమ ప్రచారంతో కార్మికులను ఆకర్షించేందుకు పలు విధాలుగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా గురువారం నాడు “ఐఎన్టీయుసి మిత్రపక్షాల” యూనియన్ తమ ఎన్నికల కార్యాలయం ప్రారంభోత్సవానికి సంబంధించిన ఆహ్వాన కరపత్రాలను పంపిణీ చేసే కార్యక్రమానికి హాజరై తమ మద్దతు తెలపాలని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఐఎన్టీయూసీ మిత్రపక్షాలకు మద్దతు తెలుపుతూ గతంలో ఎన్నడూ చూడని విధంగా అత్యంత భారీ సంఖ్యలో కార్మికులు హాజరై ఐఎన్టియుసి మిత్రపక్షాలకు తమ మద్దతు తెలపడం జరిగింది.

ఇందులో భాగంగా కార్యక్రమానికి హాజరైన కార్మికులు ” మార్పు కావాలి.. ఐఎన్టీయుసి రావాలి “, ” అహంకారం పోవాలి ఐఎన్టియుసి రావాలి ” అనే నినాదాలతో ఐటిసి ప్రాంగణాన్ని హోరెత్తించారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం, శ్రేయస్సు కోరే ఐఎన్టియుసి మిత్రపక్షాలకే ఎల్లవేళలా తమ మద్దతు ఉంటుందని, ఈసారి ఐటిసి పరిశ్రమలో ఐఎన్టియుసి జెండా ఎగరడం ఖాయమని తమ ధీమా వ్యక్తం చేశారు.

ఐఎన్టీయూసీ మిత్రపక్షులకు ఇంత భారీ మద్దతు కార్మిక వర్గాల నుంచి లభించటానికి కారణం గతంలో గెలిచిన యూనియన్ చేసినటువంటి నష్టదాయకమైన ఒప్పందమే ప్రధాన కారణమని పలువురు విశ్లేషిస్తున్నారు అదేవిధంగా గత ఒప్పందంలో రాసిన ఎంప్లాయిస్ కాలనీ నిర్మాణాన్ని పూర్తి చేయించడంలో విఫలమవ్వటం, కార్మికులకు హౌసింగ్ లోన్ ఇప్పించడంలో విఫలమవ్వడం, కాంట్రాక్ట్ కార్మికులకు స్కిల్ మాట్రిక్స్ అమలు చేయించడలో విఫలమవ్వడం, కాంట్రాక్ట్ కార్మికుల జీతాలలో కోత విధించడం, ఐటీసీ అనుబంధ బిపిఎల్ స్కూల్ విద్యావ్యవస్థ ప్రక్షాళన చేయడంలో గుర్తింపు సంఘం దృష్టి పెట్టకపోవడం ప్రధానమైన కారణాలుగా పలువురు విశ్లేషిస్తున్నారు..

వీటన్నింటినీ గమనించిన కార్మికులు “ఐఎన్టీయూసీ మిత్రపక్షాలు” గెలిస్తేనే తమకు మంచి వేతన ఒప్పందం చేసుకునేందుకు అవకాశం ఉంటుందని భావించి ఐఎన్టియుసి మిత్రపక్షాలు పిలుపునిస్తున్న ప్రతి కార్యక్రమానికి స్వచ్ఛందంగా అత్యంత భారీ సంఖ్యలో హాజరవుతూ తమ మద్దతును ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు గోనె రామారావు, యారం పిచ్చిరెడ్డి మాట్లాడుతూ, తమ పిలుపుకు స్పందించి స్వచ్ఛందంగా అన్ని కార్యక్రమాలకు హాజరవుతూ తమ మద్దతును తెలియజేస్తూ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్న కార్మికులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు.

ప్రతి కార్యక్రమానికి కార్మికుల నుండి వస్తున్న మద్దతును చూసి ప్రత్యర్థి సంఘాలు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని, ఇదే జోష్ ని ఎన్నికల రోజు వరకు కొనసాగిస్తూ తమ అమూల్యమైన ఓటును ” త్రాసు గుర్తు ” పై వేసి ఐఎన్టీయూసీ మిత్రపక్షాలను అత్యంత భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. దీని ద్వారా పర్మినెంట్ కార్మికులు, బదిలీ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులకు మంచి వేతన ఒప్పందం చేయడం ద్వారా వారి జీవితాల్లో వెలుగు నింపేందుకు అవకాశం ఉంటుందని, దీనికోసం ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా పనిచేసి ఐఎన్టీయుసి మిత్రపక్షాలను విజయ తీరాలకు చేర్చాలని పిలుపునిచ్చారు.



