Friday, March 27, 2026
HomeTechnologyఐటీ ఉద్యోగాల ఊచకోత, ఒకేసారి 12 వేల మందిపై వేటు- లిస్టులో నెక్స్ట్..!!

ఐటీ ఉద్యోగాల ఊచకోత, ఒకేసారి 12 వేల మందిపై వేటు- లిస్టులో నెక్స్ట్..!!

Loading

మన భద్రాద్రి వెబ్ డెస్క్: ఐటీ రంగంలో ఉద్యోగాల ఊచకోత కొనసాగుతోంది. అగ్ర శ్రేణి ఐటీ సంస్థలు వేలాది ఉద్యోగాల్లో కోత పెడుతున్నాయి. అతి పెద్ద ఐటీ సర్వీసుల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) తన మొ త్తం ఉద్యోగులలో 2 శాతం మందికి ఉద్వాసన పలకనుంది.

ఈ మేరకు ప్రస్తుత ఆర్దిక సంవత్సరం లో దాదాపు 12 వేల మంది ఉద్యోగుల పై వేటు పడుతోంది. వీరిలో మధ్య స్థాయి, సీనియర్‌ స్థాయి ఉద్యోగులపై అధికంగా ఉన్నారు. ఏఐ ప్రభావంతో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇక, ఇదే తరహా నిర్ణయాలకు ఇతర సంస్థలు సిద్దం అవుతున్నాయి.

  • ఉద్యోగాల ఊచకోత..

ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్ లో 12 వేల మంది ఉద్యోగుల పై వేటు పడుతోంది. ఈ విషయాన్ని టీసీఎస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కే కృతివేశన్‌ వెల్లడించారు. అత్యంత వేగంగా సాంకేతిక మార్పులు చోటుచేసుకుంటున్న వేళ భవిష్యత్తు అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సంసిద్ధంగా ఉండక తప్పదని ఆయన అన్నారు. విజయం సాధించాలంటే ఏ సంస్థ అయినా భవిష్యత్తు మార్పులను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. కృత్రిమ మేధ(ఏఐ) వంటి నూతన టెక్నాలజీ లను అందిపుచ్చుకుంటూ పని విధానాలలో మార్పులు చేసుకుంటున్నామని ఆయన చెప్పారు. ఏఐని పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

  • దిగ్గజ సంస్థల్లో..

అదే సమయంలో ఉద్యోగులను వేరే విధంగా వాడుకోవడానికి అవకాశం ఉన్నచోట వారికి అవకా శాలు కల్పిస్తున్నామని, అలాంటి అవకాశం లేని పరిస్థితుల్లో ఉద్వాసన తప్పదని స్పష్టం చేసారు. కాగా, 2025 జూన్‌ నాటికి ప్రపంచవ్యాప్తంగా 6.13 లక్షల మంది టీసీఎస్‌ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 2 శాతం మంది అంటే సుమారు 12,200 మంది ఉంటారు. లేఆఫ్‌లు జూనియర్‌ లెవెల్‌లో కాకుండా మిడిల్‌ మేనేజ్‌మెంట్‌, సీనియర్‌ లెవెల్స్‌లో అధికంగా ఉంటాయని కృతి వాసన్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌, ఇంటెల్‌, మెటా వంటి దిగ్గజ సంస్థలు కూడా భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు లక్ష మందికిపైగా టెకీలపై వేటు పడింది.

  • ఏఐ ప్రభావం…

ప్రధానంగా ఐటీ పైన ఏఐ వినియోగం పడింది. దీంతో పాటుగా ఆర్థిక మందగమనం, ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా ఐటీ సంస్థలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఈ ఏడాది సుమారు 25 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రముఖ చిప్‌ తయారీ సంస్థ ఇంటెల్‌ ఇటీవల ప్రకటించింది. ఇది మొత్తం ఉద్యోగుల్లో 20 శాతంగా ఉంది. అదే విధంగా టెక్‌ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ మేలో 6 వేల మందిపై, జూలైలో 9 వేల మంది ఉద్యోగులపై వేటు వేసింది. ఈ ఏడాది ప్రారంభంలో మెటా 3 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించింది. ఐబీఎం లో ఏఐ వల్ల 8 వేల మంది ఉద్యోగులను తెలిగించింది. అందులో ఎక్కువగా హెచ్‌ఆర్‌, అడ్మినిస్ట్రేషన్‌ విభాగాల్లో తొలగింపుల ప్రభావం పడింది. దీంతో.. నెక్స్ట్ ఏ కంపెనీ లో ఎలాంటి నిర్ణయం వస్తుందనే ఆందోళన ఉద్యోగుల్లో కనిపిస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page