![]()
ట్రైబల్ వెల్ఫేర్ కాలేజీ హాస్టల్ ఔట్ సోర్సింగ్ వర్కర్ లకు 26వేలు వేతనం ఇవ్వాలని ఎమ్మెల్యే కు వినతి పత్రాలను సమర్పించిన సీఐటీయూ.
ఇల్లందు, మన భద్రాద్రి న్యూస్, సెప్టెంబర్ 06
ట్రైబల్ వెల్ఫేర్ కాలేజీ హాస్టల్ లలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ వర్కర్ లకు రావలసిన 10నెలల వేతనాలు చెల్లించాలని, క్యాటరింగ్ విధానాన్ని రద్దు చేయాలని, జీ ఓ 60 ప్రకారం 15600 వేతనం ఇవ్వాలని,వేతనం తో కూడిన సెలవులు ప్రకటించాలని, గుర్తింపు కార్డులు, యూనిఫాం, పీఎఫ్, ఇఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని పై సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 12 నుండి సమ్మె లోకి పోతున్నామని హాస్టల్ ఎదుట టెంట్ వేసుకొని దీక్షలు చేస్తామని సమ్మె నోటీసు ను సీఐటీయూ గా స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య క్యాంపు కార్యాలయంలో మరియు ఏటిడబ్ల్యూఓ అనురాధ కి వినతి పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటీయు నేత తాళ్లూరి కృష్ణ, హాస్టల్ ఔట్ సోర్సింగ్ వర్కర్ నాయకులు కుంజ జయ, ఈసం కవిత, ఈసం విజయ, సరికొండ సరోజ, వర్ష సుధ తదితరులు పాల్గొన్నారు.


