![]()
కలెక్టర్ ఆదేశాలతో అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ..
12మంది గర్భిణులను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలింపు
చర్ల,మన భద్రాద్రి న్యూస్, జూలై 22:
సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని నెలరోజుల లోపు కాన్పు సమయం ఉన్న గర్భిణులను డాక్టర్ దివ్య నాయనా అంబులెన్స్ ద్వారా సోమవారం భద్రాచలంలోని ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. భారీ వర్షాలు,వరదల కారణంగా భద్రాద్రి జిల్లా కలెక్టర్, ఆదేశానుసారం. సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ దివ్య నయన నేతృత్వంలో కుర్నపల్లి,గోరుగొండ,బోటు గూడెం,దేవరపల్లి, శివలింగాపురం,కుదునూరు, కలివేరు గ్రామాలకు చెందిన 12 మంది గర్భిణులను ముందు జాగ్రత్తగా భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది.చెన్నాపురం, ఎర్రంపాడు గ్రామాల్లో ఉన్న గర్భిణులను తరలించేందుకు గ్రామాల్లోకి సిబ్బంది చేరుకున్నారని అన్నారు. వరదల దృశ్య వైద్య శిబిరాలు నిర్వహించేందుకు సిబ్బందిని,అవసరమైన మందులను అందుబాటులో ఉంచామని తెలిపారు


