![]()
కల్పవృక్ష నారసింహుని దర్శనం కొరకు వచ్చిన యూట్యూబ్ స్టార్స్
భద్రాచలం, మన భద్రాద్రి న్యూస్
కల్పవృక్ష నారసింహ సాలగ్రామ మూర్తి చూపిస్తున్న మహిమలు ఎన్నో. ఇక్కడ స్వామిని దర్శనం చేసుకొని ముడుపు కడితే అనుకున్న పని జరుగుతుందని తెలుసుకొని గతంలో ఇక్కడకు వచ్చామని, ఎన్నో విజయాలను అనతి కాలంలోనే పొందామని డైరెక్టర్ అండ్ లిరిక్ రైటర్ కె.కె. రాజు అన్నారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ రెండేళ్ల క్రితం ఎవరో చెబితే ఇక్కడకు వచ్చామని, కానీ ఇక్కడ ముడుపులు చెల్లించిన తరువాతే ఎన్నో హిట్ సాంగ్స్ ని మా బ్యానర్లో చేశామని, ఒక్కో సాంగ్ కొన్ని మిలియన్ల వ్యూస్ తో ప్రేక్షకుల మనసులు దోచాయని, మళ్ళీ ప్రేక్షకుల మన్ననలు పొందే భాగ్యం దొరుకుతుందనే ఆశతో ఇక్కడికి వచ్చామని అన్నారు. నిజంగా ఇక్కడ ఏది కోరితే అది నెరవేరుతుందని సీనియర్ ఆర్టిస్ట్ జయకృష్ణ, హీరోయిన్ శ్రీయదీప్ అన్నారు. మొదటి సారి దర్శనం చేసుకున్నప్పుడు ముడుపులు కట్టామని మాకు చిన్న గుర్తింపు వస్తే చాలు అనుకున్నాం కానీ, మేమే స్టార్స్ అవుతామని అనుకోలేదని అన్నారు. ఇక్కడకు రావడం మా అదృష్టంగా భావిస్తున్నామని, ప్రస్తుతం మేము ఎన్నో సాంగ్స్ చేస్తూ బిజీగా ఉంటున్నామంటే అది కల్పవృక్ష నారసింహ స్వామి లీలగానే భావిస్తున్నామని అన్నారు. సంక్రాతి తరువాత స్వామివారి పాటనే షూట్ చేసి స్వామివారికి దక్షిణగా ఇస్తామని అన్నారు. కల్పవృక్ష నారసింహ సాలగ్రామ మూర్తిపై డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి రాసిన పాట మొదటి చరణం చిత్రీకరణ పూర్తి చేయడం జరిగింది. హైదరాబాద్ నుండి వచ్చిన ఈ బృందానికి కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమం నిర్వాహకులు డా. కృష్ణ చైతన్య స్వామి మంగళా శాసనములు అందించి నృసింహ రక్షను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆశ్రమం నిర్వాహకులు డా. కృష్ణ చైతన్య స్వామి, కేకే మీడియాస్ అధినేత రాజు, సీనియర్ మరియు జూనియర్ ఆర్టిస్ట్ లు తదితరులు పాల్గొన్నారు.


