Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemకార్మికులకు 26 వేల కనీస వేతనం చెల్లించండి

కార్మికులకు 26 వేల కనీస వేతనం చెల్లించండి

Loading

-యాకుబ్ షావలి

-టేకులపల్లిలో ఇఫ్టు ఏరియా నాల్గవ మహాసభ

టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్, జూన్ 14

భారత కార్మిక సంఘాల సమైఖ్య (ఇఫ్టు) ఏరియా 4వ మహాసభను మండల కేంద్రంలో వాంకుడోత్ నరేష్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. మహాసభ ముందు జెండా ఆవిష్కరణను ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు జరుపుల సుందర్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన మహాసభలో ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి ఎస్కె యాకుబ్ షావలి పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో కోట్ల రూపాయల లాభాలు వస్తున్నాయని, ఈ లాభాలకు కారకులైన కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడం లేదని ఆరోపించారు. కేఓసి 2003 బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు బొగ్గు టిప్పర్ల ద్వారా నవభారత్, కేటిపిఎస్, బిపిఎల్, ఇల్లందులలో డంపింగ్ చేస్తున్న డ్రైవర్లకు కనీస వేతనాలు గానీ, పిఎఫ్ గాని అమలు చేయడం లేదని వాపోయారు. సీఎంపిఎఫ్ కోల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ లకు, కన్వీనియన్స్ డ్రైవర్లకు అమలు చేస్తామని ప్రభుత్వం సర్కులర్ జారీ చేసినా, నేటి వరకు బొగ్గు టిప్పర్ డ్రైవర్లకు అమలు చేయలేదని అన్నారు. కన్వీనెంట్స్ డ్రైవర్లకు మాత్రం అమలు చేస్తుందన్నారు. బొగ్గు టిప్పర్ డ్రైవర్లకు కూడా కనీస వేతనాలు, పిఎఫ్ తదితర చట్టబద్ధహక్కులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి గ్రామపంచాయతీ, భగీరథ తదితర రంగాల కార్మికులలో పనిచేసే కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో మోటార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాయం వెంకన్న, ఏనుటి నాగయ్య, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page