Tuesday, March 24, 2026
HomeHyderabadకిటకిటలాడుతున్న చర్లపల్లి రైల్వే స్టేషన్

కిటకిటలాడుతున్న చర్లపల్లి రైల్వే స్టేషన్

Loading

హైదరాబాద్, మన భద్రాద్రి వెబ్ డెస్క్: తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లను సాధనే లక్ష్యంగా.. ఢిల్లీ వేదికగా మూడు రోజుల పాటు తెలంగాణ కాంగ్రెస్ భారీ ధర్నా చేసేందుకు ప్లాన్ చేశారు.

ఈ మేరకు అన్ని జిల్లాల అధ్యక్షులకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రతీ జిల్లా నుంచి 25 మంది కార్యకర్తలను చర్లపల్లికి తీసుకొచ్చే భాద్యతను డీసీసీ అధ్యక్షులకు అప్పగించారు. దీంతో ఈ రోజు తెల్లవారుజామున అన్ని జిల్లాల నుంచి కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున చర్లపల్లి రైల్వే స్టేషన్ కు తరలి వచ్చారు. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో చర్లపల్లి రైల్వే స్టేషన్ కొత్త రైల్వే స్టేషన్ కిటకిటలాడుతుంది.

మొదటి సారి అక్కడకు వచ్చిన నేతలు రైల్వే స్టేషన్ లో ఫోటోలు, సెల్ఫీలు దిగుతూ.. సందడి చేశారు. ఇదిలా ఉంటే మరికొద్ది సేపట్లో ప్రత్యేక రైలు నాగపూర్ కు భయలుదేరనుంది. అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఏఐసీసీ ఇంచార్జ్, టీపీసీసీ అధ్యక్షుడు ఢిల్లీకి ప్రయాణించనున్నారు. కార్యకర్తలు వెళ్లే ట్రైన్ లోనే ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు కుమార్ గౌడ్ ప్రయాణించనున్నారు. వీరు కూడా కొద్దిసేపటి క్రితమే చర్లపల్లి రైల్వే స్టేషన్ వచ్చారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page