Wednesday, March 25, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemకిన్నెరసాని పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

కిన్నెరసాని పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Loading

కిన్నెరసాని పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

-కిన్నెరసాని ఏఈ

పాల్వంచ, మన భద్రాద్రి న్యూస్, జూలై 21

కిన్నెరసాని నది పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కిన్నెరసాని ఏఈ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆదివారం కిన్నెరసాని డ్యాంకు భారీగా వరద నీరు వచ్చి చేరుకుంటుందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో పరిస్థితులను బట్టి ఏ సమయంలోనైనా కిన్నెరసాని డ్యామ్ గేట్లను ఎత్తి వరదనీరు దిగువకు విడుదల చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రజలెవరు వాగులు దాటే ప్రయత్నాలు చేయవద్దని, చేపల వేటకు వెళ్లకపోవడం మంచిదని ఆయన సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page