![]()
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా కుప్పం ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు కట్టేసి ముని కన్నప్ప అనే వ్యక్తి ఆమెపై దాడి చేశాడు. సీఎం చంద్రబాబు ఎస్పీతో ఫోన్‌లో ఈ ఘటనపై ఆరా తీశారు. నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశామని చంద్రబాబుకు ఎస్పీ తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సిఎం హెచ్చరించారు. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని ఎస్పీని సీఎం ఆదేశించారు. నిందితులపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి సీఎం సూచించారు.


