![]()
-మాజీ ఎంపీపీ కొండ్రు మంజు భార్గవి
ఆళ్లపల్లి, మన భద్రాద్రి బ్యూరో, ఏప్రిల్ 20
మండల కేంద్రంలోని ఆదివాసీ కమ్యూనిటీ హాల్ స్థల ప్రాంగణంలో ఆదివారం కొమరం భీం విగ్రహావిష్కరణ కొరకు వాస్తు ప్లానర్ తో ముగ్గు పోయించిన అనంతరం జరిగిన సమావేశానికి ఆదివాసీ ఐక్య కార్యాచరణ సమితి మండల అధ్యక్షులు పాయం రమేష్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ కొండ్రు మంజు భార్గవి మాట్లాడుతూ కొమరం భీం ఆదివాసీల ఆశాజ్యోతి అని, ఆదివాసీల హక్కుల కోసం నిజాం ప్రభుత్వ దమన విధానాలకి వ్యతిరేకంగా పోరాడిన వీరుడిగా చరిత్రలో నిలిచారని అన్నారు. జల్, జంగల్, జమీన్ (నీరు, అడవి, భూమి) అనే నినాదంతో ఆదివాసీల హక్కులను కాపాడటానికి తన ప్రాణాలను అర్పించిన మహా నాయకుడని, నేటి యువత కూడా కొమరం భీం పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని, సమాజంలో అన్యాయానికి, అసమానతలకు వ్యతిరేకంగా నిలబడి, సమానత్వం, హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. దేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలంటే యువతలో ఆత్మ విశ్వాసం, నాయకత్వ గుణం, సామాజిక బాధ్యత వంటి విలువలు అవసరమని, హక్కుల సాధన కోసం ఐక్య ఉద్యమాలు చేయవలసిన సమయం ఆసన్నమైనదని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కొమరం హనుమంతరావు, మాజీ ఎంపీపీ పడిగ సమ్మయ్య, మాజీ సర్పంచ్ మెస్సు కోటేశ్వరరావు, ఈసం సాంబశివరావు, పీఏసీఎస్ డైరెక్టర్, ఏఈడబ్ల్యూసీఏ జిల్లా కార్యదర్శి జోగ రాంబాబు, ఊకె కిషోర్ బాబు, వజ్జ పగడయ్య, గొగ్గెల వెంకటేశ్వర్లు, బట్టు సురేష్, కొమరం వెంకటకృష్ణ, గొగ్గెల గాదెరాజు, సుబ్బారావు, అరెం బాలకృష్ణ, గొగ్గెల వినోద్, ఏడూళ్ళ రామనాథం, ఏడూళ్ళ రమేష్, గొగ్గెల లక్ష్మయ్య, కొమరం గాదెరాజు, కల్తి హనుమంతు, మెస్సు శ్రీను, చందా వీరయ్య, వట్టం ముత్తయ్య, ఏడూళ్ళ అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.


