Monday, March 23, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemగిరిజనేతరుడి కబంధ హస్తాల్లో ఇసుక ర్యాంప్..!

గిరిజనేతరుడి కబంధ హస్తాల్లో ఇసుక ర్యాంప్..!

Loading

గిరిజనేతరుడి కబంధ హస్తాల్లో ఇసుక ర్యాంప్

సొసైటీ ఇసుక ర్యాంపులో గిరిజనేతరులకు ఏం పని

గిరిజనేతరుడు ఆగడాలపై పిఓ చర్యలు తీసుకోవాలి.. పాయం

చర్ల,మన భద్రాద్రి న్యూస్, సెప్టెంబర్ 11

ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇసుక రాంపులను తీసుకువచ్చింది. ఆదివాసీలకి పూర్తి హక్కులు కల్పించే దిశగా కాంగ్రెస్ సర్కార్ ముందుకెళ్తుంది. ఏజెన్సీ ఏరియాలోని ఇసుక రీచ్ లను ఎక్కడికక్కడ గిరిజన మహిళా సొసైటీలకు అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఆదివాసీలు ఆనందం వ్యక్తం చేశారు. కుదునూరు గ్రామపంచాయతీకి సంబంధించిన ఇసుక ర్యాంపు మంజూరులో స్థానిక గిరిజనేతరుడి కనుసన్నల్లో సూచనలతో ఆయన అనుచరుల మహిళలతో కమిటీని ఏర్పాటు చేసుకొని కుదునూరు గ్రామంలో ఉన్న పది కుటుంబాలకు సొసైటీలో ప్రమేయం లేకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ గొండ్వనా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు పాయం సత్యనారాయణ ఓ ప్రకటనను విడుదల చేశారు.

చర్ల మండల కేంద్రంలో శుక్రవారం ఇర్ఫా ప్రకాష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాయం సత్యనారాయణ మాట్లాడుతూ కుదునూరు గ్రామంలో ఆదివాసీలను ఇసుక ర్యాంపుల్లో రానీయకుండా ఓ గిరిజనేతరుడు అడ్డుకుంటున్నాడని,ర్యాంపు రేసింగ్ కాంట్రాక్టర్ కూడా గిరిజనేతరులకు సపోర్టు చేస్తున్నారని ఆరోపించారు. గ్రామంలోని ఇసుక ర్యాంపు ఓ గిరిజనేతరుడి కబంధహస్తాల్లో నడుస్తుందని, ఆయన అనుచరుల మహిళలతో కమిటీని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా గ్రామంలో ఉన్న పది కుటుంబాలను సొసైటీలు సమయం లేకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. గిరిజనేతరుడు ఆగడాలపై ఐటిడిఏ పిఓ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. అలాంటి వారిని అధికారులు గుర్తించి మహిళా కమిటీ సభ్యులు నడుపుటకు అధికారులు సూచించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో చర్ల వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం వరప్రసాద్, బీర బోయిన శేఖర్, ఇర్ఫా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page