![]()
గిరిజన క్రీడాకారునికి ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే తెల్లం మరియు డాక్టర్లు
- కృతజ్ఞతలు తెలిపిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్
భద్రాచలం, మన భద్రాద్రి బ్యూరో, జులై 21
ములుగు జిల్లా, వాజేడు మండలం, ఇప్పగూడెంకు చెందిన 21 సంవత్సరాల వయసున్న మోడెం వంశీ ఎనిమిది సంవత్సరాల క్రితం అనగా 2016లో దినసరి కూలి స్థాయి నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ కోచింగ్ మరియు సహాయ సహకారాలతో ఈ రోజున అంతర్జాతీయ స్థాయి పోటీలకు భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదిగాడు. ఇతను అంతర్జాతీయ స్థాయిలో జూనియర్ పవర్ లిఫ్టింగ్ విభాగంలో పోటీ పడుటకు గాను, ఆర్థిక సహాయం మరియు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న క్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు 15 వేల రూపాయలు, డాక్టర్ సోమయ్య 25 వేల రూపాయలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కృష్ణ ప్రసాద్ దంపతులు 10 వేల రూపాయలు, డాక్టర్ నరసింహారెడ్డి 5 వేల రూపాయలు, డాక్టర్ రవి కుమార్ 5 వేల రూపాయలు మొత్తంగా కలిపి 60 వేల రూపాయలు సహాయాన్ని ప్రకటించారు. సహాయం అందించిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, డాక్టర్లు మోడెం వంశీ మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసోసియేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది.


