Tuesday, March 24, 2026
HomeCrimeగుండెపోటుతో 9 ఏళ్ల బాలిక మృతి!

గుండెపోటుతో 9 ఏళ్ల బాలిక మృతి!

Loading

మన భద్రాద్రి వెబ్ డెస్క్: ఇటీవలి కాలంలో గుండెపోటుతో చిన్న వయసులోనే మరణిస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. దురదృష్టవశాత్తు, ఓ 9 ఏళ్ల బాలిక గుండెపోటుతో మరణించిన విషాద సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది.

సికార్లోని ఆదర్శ్ విద్యా మందిర్ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న ప్రాచి కుమావత్ అనే బాలిక లంచ్ టైమ్ లో తన బాక్స్ ను తెరుస్తుండగా అకస్మాత్తుగా స్పృహ కోల్పోయింది. వెంటనే బాలికను ఆసుపత్రికి తరలించారు. అయితే బాలికను అంబులెన్స్లోకి తరలిస్తుండగా ఆమెకు మరోసారి గుండెపోటు వచ్చి అక్కడికక్కడే మరణించింది. ఆమెను బతికించడానికి దాదాపు గంటన్నర పాటు ప్రయత్నించామని వైద్యుడు డాక్టర్ ఆర్కె జాంగిద్ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page