Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemగుడిసెవాసుల సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కు వినతి

గుడిసెవాసుల సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కు వినతి

Loading

ఇల్లందు, మన భద్రాద్రి న్యూస్, ఏప్రిల్ 20
ఇల్లందు మండలంలో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న దేవులపల్లి యాకయ్య నగర్, సున్నం రాజయ్య నగర్, మల్లు స్వరాజ్యం నగర్ గుడిసెవాసులకు ఇంటి నంబర్లను కేటాయించాలని, ఇతర మౌళిక సౌకర్యాలు కల్పించాలని, జెకే ఓసి నిర్వాసితులకు ఇచ్చిన క్వార్టర్స్ కూల్చివేత నిలిపివేయాలని, పైలట్ గ్రామామైన పూబెల్లిలో ఇందిరమ్మ ఇండ్లు రానివారికి ఇవ్వాలని మంచి నీరు, ఇంటి స్థలం, రేషన్ కార్డులు, విద్యుత్ మీటర్లు వంటి ఇంటింటి సర్వేలో వచ్చిన సమస్యలపై జిల్లా కలెక్టర్ కి వినతిపత్రంను సీపీఎం ఇల్లందు మండల కమిటీ ఆదివారం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా సీపీఎం మండల కార్యదర్శి ఆలేటి కిరణ్ మాట్లాడుతూ వినతిపత్రంలో పేర్కొన్న సమస్యలపైన కలెక్టర్ సానుకూలంగా స్పందించ్చారని, నిర్వాసితులకు ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని, గుడిసెవాసులపట్ల స్థానిక తహసీల్దార్ కు సర్వే నిర్వహించాలని ఆదేశించారని, ఇందిరమ్మ ఇండ్లు రాని వారు దరఖాస్తు చేసుకోవాలని అన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు తాళ్లూరి కృష్ణ, మన్నెం మోహన్ రావు, వజ్జా సురేష్, గుడిసెవాసులు, నిర్వసితులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page