Tuesday, March 24, 2026
HomeTelangana NewsKhammam Newsఘనంగా బాలికా దినోత్సవం

ఘనంగా బాలికా దినోత్సవం

Loading

ఘనంగా బాలికా దినోత్సవం

పాలేరు, మన భద్రాద్రి

బాలికలను ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ శ్రీ లక్ష్మీ అన్నారు. బుధవారం జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా తిరుమలాయపాలెం మండలం పైనం పెళ్లి గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో జాతీయ బాలికల దినోత్సవ వేడుకలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆడపిల్లల హక్కుల గురించి చైతన్యం కల్పించడం, బాలిక విద్య ప్రాముఖ్యత, వారి ఆరోగ్యం, పోషణపై అవగాహన పెంచడం వంటివి జాతీయ బాలికల దినోత్సవ లక్ష్యాలన్నారు. బాలికల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నాయని వివరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పార్థసారథి, అంగన్వాడి టీచర్ బోల్లికొండ సుహాసిని, పూలమ్మ, సునీత తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page