![]()
ఇల్లందు మన భద్రాద్రి న్యూస్ జూలై 24
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) పుట్టినరోజు సందర్భంగా పురస్కరించుకొని గురువారం ఇల్లందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ ఆదేశానుసారం గురువారం ఇల్లందు పట్టణంలోని ఐతా కాంప్లెక్స్ నందు భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక సభ్యులు దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి ఇల్లందు పట్టణ మరియు మండల ముఖ్య నాయకులు కీలక నేతలతో కలిసి ఘనంగా పుట్టినరోజు వేడుకుని నిర్వహించడం జరిగింది.
అందులో భాగంగా ముందుగా ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల నందు మొక్కను నాటి కేటీఆర్ కి బహుమతిగా అందజేశారు.అనంతరం ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసి, తల సేమియా బాధితుల కొరకు రక్తదాన శిబిరాన్ని నిర్వహించి, కార్యక్రమానికి విచ్చేసిన భారత రాష్ట్ర సమితి పార్టీ ఇల్లందు పట్టణ మరియు మండల ముఖ్య నాయకులు ప్రజా ప్రతినిధులు మహిళా విభాగం యూత్ విభాగం కార్యకర్తలు అభిమానుల నడుమ కోలాహలంగా ఆటపాటలతో కేక్ కట్ చేసి కేటీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక సభ్యులు దిండిగాల రాజేందర్ , పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భవిష్యత్తులో భారత రాష్ట్ర సమితికి మరిన్ని సేవలు అందించి మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.


