Friday, March 27, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemఘనంగా శ్రీరాముని కళ్యాణం, పోకల దమ్మక్క సేవ యాత్ర

ఘనంగా శ్రీరాముని కళ్యాణం, పోకల దమ్మక్క సేవ యాత్ర

Loading

ఘనంగా శ్రీరాముని కళ్యాణం, పోకల దమ్మక్క సేవ యాత్ర

స్వామి వారి కళ్యాణం ను చూసేందుకు భారీగా తరలి వచ్చిన భక్తులు

కార్యక్రమంలో పాల్గొన్న భద్రాచలం రామాలయం ఈఓ రమాదేవి

ఆలయానికి ధూప దీప నైవేద్య పథకం వర్తింపజేయాలని కోరిన గ్రామస్తులు

చర్ల, మన భద్రాద్రి న్యూస్

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో చర్ల మండలం ఆర్ కొత్తగూడెం గ్రామంలోని శ్రీ విజయరామ మందిరంలో ఆదివారం అత్యంత ఘనంగా దమ్మక్క సేవ యాత్ర, స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. శోభాయాత్ర, కళ్యాణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భద్రాచలం రామాలయం ఈఓ రమాదేవి పాల్గొన్నారు. స్వామివారి కల్యాణాన్ని గిరిజన సంప్రదాయాల ప్రకారం నిర్వహించారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు రామ స్వరూప్ ఆధ్వర్యంలో కల్యాణ క్రతువు నిర్వహించారు. స్వామివారి కళ్యాణాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఈఓ రమాదేవి మాట్లాడుతూ పోకల దమ్మక్క శ్రీరామచంద్ర స్వామి వారికి అత్యంత భక్తురాలని. రాముడిపై భక్తితో అపర శబరిగా పేరొందిన పోకల దమ్మక్క భద్రగిరి పై తాటి చెట్టు కింద పుట్టలో ఉన్న రామచంద్ర మూర్తి విగ్రహాన్ని గుర్తించి. గోదావరి నుంచి నీళ్లు తెచ్చి పుట్టపై పోసి శ్రీరామచంద్రస్వామి వారికి మొదట అభిషేకం చేశారని గుర్తు చేశారు. పరమ భక్తిశ్రద్ధలతో శ్రీరాముడిని కొలుస్తుండెదని. ఆ మహా భక్తురాలి భక్తికి మెచ్చి ఒకరోజు శ్రీరాముడు ఆమెకు కలలో కనిపించడం జరిగిందని. గతంలో ఇచ్చిన వరం ప్రకారం భద్రగిరిపై ఉన్నానని. నన్ను మిగతా భక్తులు కూడా సేవించి తరించేలా ఏర్పాట్లు చేయండి ఈ కార్యక్రమంలో నీకు మరో పరమ భక్తులు సహాయంగా నిలుస్తాడు అని ఆదేశించటం జరిగిందని. భద్రగిరి పై రామయ్య కొలువున్న విషయాన్ని భక్త రామదాసు కు తెలియజేసి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆనాటి నుండి అపర శబరిలా శ్రీరాముడికి సేవలు చేసుకుంటూ పోకల దమ్మక్క తరించే వారిని అన్నారు.

కార్యక్రమం అనంతరం గ్రామస్తులు,భక్తులు ఈఓ రమాదేవిని కలిసి గ్రామంలోని రామాలయానికి ధూప దీప నైవేద్యాలు పథకం వర్తింపజేయాలని. ప్రతి శ్రీరామనవమికి భద్రాచలం రామాలయం నుండి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ఆలయానికి సమర్పించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఈ ఓ రమాదేవి ఆరు కొత్తగూడెం గ్రామంలోని రామాలయానికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని గ్రామ పెద్దలు తెలిపారు.అనంతరం ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు, భక్తుల ఆధ్వర్యంలో ఈఓ రమాదేవి ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page