Monday, March 23, 2026
HomeNational Newsచత్తీస్ ఘడ్ బీజాపూర్ లో భారీ ఎన్ కౌంటర్

చత్తీస్ ఘడ్ బీజాపూర్ లో భారీ ఎన్ కౌంటర్

Loading

చత్తీస్ ఘడ్ బీజాపూర్ లో భారీ ఎన్ కౌంటర్

నలుగురు మావోయిస్టులు మృతి

సంఘటన స్థలం నుండి ఆయుధాలు మందు గుండు సామాగ్రి స్వాధీనం

చర్ల,మన భద్రాద్రి న్యూస్

చత్తీస్గడ్ బీజాపూర్ జిల్లాలో భద్రత బలగాలకు మావోయిస్టులకు శనివారం ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్ కౌంటర్ లో భద్రత బలగాలు నలుగురు మావోయిస్టులను హత మార్చారు. బీజాపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశం అయ్యారనే సమాచారం నిఘా వర్గాల నుండి అందడంతో భద్రత బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు సమాచారం. ఈ ఆపరేషన్స్ శనివారం సాయంత్రం నుండి భద్రత బలగాలకు మావోయిస్టులకు మధ్య అడపా ఎదురు కాల్పులు కొనసాగుతూనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ అనంతరం ఎన్ కౌంటర్ స్థలం నుండి భద్రత బలగాలు నలుగురు మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఇన్సాస్, ఎస్ ఎల్ ఆర్ రైఫిల్స్ భారీగా పేలుడు పదార్థాలు మావోయిస్టులు రోజువారి ఉపయోగించే సామాన్లు ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి చత్తీస్ ఘడ్ కేంద్రంగా మావోయిస్టుల ఏరివైత కార్యక్రమాన్ని భద్రత బలగాలు పెద్ద ఎత్తున ప్రారంభించారు.

మావోల జాడపై సమాచారం తెలిసిన వెంటనే సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి ఎన్ కౌంటర్లు చేపడుతున్నారు.ఈ ఆపరేషన్ లలో ఇప్పటికే చాలామంది మావోలు మృతి చెందారు. ఒకపక్క అరెస్టులు, మరోపక్క లొంగుబాట్లతో వందల మంది మావోయిస్టులు అడవి బాట వీడి అధికారుల ముందు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వాలు పునరావాసాలు కల్పిస్తున్నారు.ఈ ఎన్కౌంటర్ పై అధికారులు దృవీకరించాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page