![]()
చర్ల, మన భద్రాద్రి న్యూస్, జూలై 04
చెట్టుకు ఉరేసుకొని ఒకరు మృతి చెందిన ఘటన గురువారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. అంబేద్కర్ నగర్ కు చెందిన మామిడి కృష్ణ (35) అంబేద్కర్ నగర్ శివారులో ఉన్న చెరువు కట్టపై ఉన్న చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం భహిర్భూమికి వెళ్లిన వారు గమనించి వెంటనే సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై నర్సిరెడ్డి తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఓ కుమారుడు ఉన్నారు.


