Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemజిసిసి హమాలీ కార్మికులకు పిఎఫ్ ఈఎస్ఐ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి: టీ. యూ. సి. ఐ...

జిసిసి హమాలీ కార్మికులకు పిఎఫ్ ఈఎస్ఐ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి: టీ. యూ. సి. ఐ డిమాండ్

Loading

ఈనెల 26న జీసీసీ కార్యాలయం ముందు ధర్నాను జయప్రదం చేయండి.

బోల్లా సీతారాములు
హమాలి కార్యదర్శి

ఇల్లందు, మన భద్రాద్రి న్యూస్
జూలై, 24

ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా,టియుసిఐ రాష్ట్ర మహాసభల పిలుపు కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని 282 జీవోని రద్దు చేయాలని, కనీస పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలని తదితర డిమాండ్లతో ఈ నెల 31న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పిలుపులో భాగంగా ఈరోజు ఇల్లందు తెలంగాణ హమాలీ అండ్ రైస్ మిల్ వర్కర్స్ యూనియన్, టి యు సి ఐ, బ్రాంచి కమిటీ సమావేశం స్థానిక ఎల్లన్న భవనంలో జరిగింది. ఈ సమావేశంలో హమాలీ యూనియన్ సెక్రటరీ బోళ్ల సీతారాములు పాల్గొని మాట్లాడుతూ హమాలీలకు సమగ్రమైన వేతన చట్టం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హమాలి కార్మికుల సేవలను గుర్తించాలని కోరారు. ఏండ్ల తరబడి గిరిజన కార్పొరేషన్ లో (జిసిసి) పనిచేస్తున్న హమాలీలకు కనీస వేతనంగానీ సామాజిక భద్రత పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం లేదు, ప్రభుత్వ రంగ సంస్థ ఈప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న కార్మికులకి కనీస వేతనం చట్టబద్ధ హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కొరకు ఈనెల 26న జిసిసి కార్యాలయం ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని హమాలీ కార్మికులకు పిలుపునిచ్చారు. ఈనెల 31న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ బ్రాంచ్ కమిటీ సమావేశంలో, మోటం సంపత్ సందీప్ ఈసాల వెంకన్న చందర్ కంబాల బిక్షపతి, నాగేష్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page