![]()
జోరు వర్షంలో ఘనంగా గురు పౌర్ణమ మహోత్సవ పూజలు
బూర్గంపహాడ్, మన భద్రాద్రి న్యూస్, జూలై 21
గురు పౌర్ణమి మహోత్సవ సందర్భంగా మండల కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఆదివారం ఆలయ కమిటీ ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసి అర్చకులచే పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనగా గ్రామ పెద్దలు డాక్టర్ చెన్నం సత్యనారాయణ, చెన్నం ప్రసాద్ లు కుటుంబ సమేతంగా వారితో పాటు గ్రామస్థులు పాపోలు నాగేశ్వరావు, పద్మవతి దంపతుల చేతుల మీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ సర్పంచులు జక్కం బలరాం, బర్ల నాగేశ్వరావు, మాజీ ఎంపీటీసీ జక్కం సర్వేశ్వరరావు, గ్రామ వైద్యులు లక్కోజు విష్ణు దంపతులు, పలువురు గ్రామ పెద్దలు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.


