Monday, March 23, 2026
HomeHyderabadతండ్రీకూతుళ్లపై అసభ్యకర కామెంట్స్

తండ్రీకూతుళ్లపై అసభ్యకర కామెంట్స్

Loading

  • మృగాళ్లకు శిక్ష తప్పదంటూ మంత్రి సీతక్క ఫైర్

హైదరాబాద్, మన భద్రాద్రి బ్యూరో

సోషల్ మీడియాలో ట్రోలింగ్, అసభ్యకర కామెంట్స్ తారా స్థాయికి చేరాయి. మరికొందరు మానవ సంబంధాలను నిర్వీర్యం చేస్తూ సభ్య సమాజం తలదించుకునేలా కొందరు దుర్మార్గులు నీచుల్లా ప్రవర్తిస్తున్నారు. ఆ బాధను తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. తాజాగా, ఓ తండ్రి తన కూతురితో సరదాగా వీడియో చేయగా, కొంతమంది యూట్యూబర్లు డార్క్ కామెడీ పేరుతో అసభ్యకర కామెంట్స్ చేశారు. అయితే, అందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో పోక్సో చట్టం కింద ప్రణీత్‌ ను తక్షణమే అరెస్ట్ చేయాలంటూ పలువురు సోషల్ మీడియా యూజర్లు తెలంగాణ పోలీసులను ట్యాగ్ చేశారు. ఇంతలో, ప్రణీత్ అభ్యంతరకరమైన భాగాలను తీసేసి ఓ పోస్ట్ పెట్టాడు. ఈ క్రమంలోనే ఇదే అంశంపై మంత్రి సీతక్క స్పందించారు. తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని కొంతమంది నీచులు వక్రీకరించడం దారుణమని అన్నారు. సోషల్ మీడియాలో రెచ్చిపోయిన దుర్మార్గులపై ఇప్పటికే కేసు నమోదు చేశాం. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page