![]()
-రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
-వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించిన మంత్రి ధనసరి సీతక్క
ములుగు, మన భద్రాద్రి న్యూస్, మే 18
గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. జిల్లాలో
రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఎలాంటి బెంగ పెట్టుకోవద్దని, తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని శనివారం రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క హామీ ఇచ్చారు. ఇక నుంచి పంటలకు ప్రభుత్వమే భీమా ప్రీమియం చెల్లిస్తుందన్నారు. తమది రైతు ప్రభుత్వమని, రైతన్నలకు అండగా ప్రభుత్వం ఉంటుందని, జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులను ఈ సందర్భంగా మంత్రి సీతక్క ఆదేశించారు.


