![]()
తప్పుడు వార్తలను ఖండించిన గిరిజన పోడు సాగు రైతులు
- మా అభివృద్ధిని చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారాలు
- కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే మా అభివృద్ధి సాధ్యం
- తప్పుడు వార్తలను రాసిన వారిపై కేసులు నమోదు చేస్తాం
చండ్రుగొండ, మన భద్రాద్రి న్యూస్
చండ్రుగొండ మండలం, బెండలపాడు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిర సౌర జల వికాస్ పథకం కింద మండలంలో 697 సోలార్ బోర్ పంప్ సెట్లు డ్రిప్ ఉచితంగా గిరిజన పోడు సాగుదారులకు అందిస్తుంది. దానిలో భాగంగా గ్రామంలో రెండు సోలార్ పంపుసెట్లును 12 రక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేశారు. మండలంలో ఎండ తీవ్రతగా ఎక్కువగా ఉండటంతో భూగర్భజలాలు అడుగంటు పోతున్నాయి. ఈ క్రమంలోనే ఏర్పాటు చేసిన రెండు బోరుబావిలో ఒక దానిలో నీరు తక్కువగా వస్తుంది. మరొకటి సోలార్ పంప్ సెట్ అవ్వడంతో కొంత తక్కువగా విద్యుత్ ఉత్పత్తి ఉండడం చేత నీరు అందలేదని గిరిజన పోడు సాగుదారులు వెల్లడించారు.
కొన్ని పత్రిక వారు గిరిజన పోడుదారుల అభివృద్ధి చూసి ఓర్వలేక స్థానిక ప్రతిపక్ష నేతలతో చేతులు కలిపి తప్పుడు వార్తలు ను ప్రచురించి గిరిజన నిరుపేద పోడు సాగుదాల అభివృద్ధికి ఆదిలోనే తుంచాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తస్మాత్ జాగ్రత్త? మా నిరుపేద గిరిజన బిడ్డలను ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది అనడంలో సందేహం లేదు.కానీ మా గిరిజన బిడ్డలు అభివృద్ధిని కొంతమంది గ్రామంలో అడ్డుకుంటున్నారు. వారికి కొన్ని పత్రిక వారు సహకరించడం వలన పత్రిక విలువలు మంట కలుస్తున్నాయని, కొంతమంది చేసిన తప్పిదం వల్ల అన్ని పత్రికలకు వర్తిస్తుందని మండలంలో ఉన్న 697 మంది అందరం కలిసి తప్పుడు వార్తలు రాసిన వారి ఇంటిని ముట్టడి చేస్తామని మా అభివృద్ధికి అడ్డుపడే తే సహించేది లేదని అన్నారు. ఇలా తప్పుడు వార్తలు రాసి మమ్మల్ని మా బ్రతుకులు మార్చేస్తున్న వారిని వారు రాసిన వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము మాకు అండగా ఉండి అభివృద్ధి పరుస్తూ ఆరు లక్ష రూపాయలు విలువ చేసే బోర్లను ఉచితం గా అందించడం చూసి ఓర్వలేక కొన్ని పత్రిక లు గ్రామాల్లో ఉండే ప్రతిపక్ష నేతలకు అండగా ఉంటూ తప్పుడు రాతలు రాస్తున్నారని అలా రాసిన వారిపై ఎంతవరకైనా వెళ్తామని తగ్గే ప్రసక్తే లేదని వెల్లడించారు. తప్పుడు వార్తలు రాసిన వారి పై పత్రిక సంస్థలు కఠిన చర్యలు తీసుకోవాలని అలా జరగని పక్షంలో మండలంలో గిరిజన పోడు సాగుదారులు అందరము కలిసి పత్రికను అడ్డుకుంటామని తెలిపారు. వార్తలను నిరూపించిన పక్షంలో మండలంలో ఉన్న 697 మంది వార్త రాసిన వారిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెండలపాడు గ్రామంలోని గిరిజన, పోడు, సాగుదారు రైతులు తదితరులు పాల్గొన్నారు.


