Tuesday, March 24, 2026
HomeHyderabadతవ్వేకొద్దీ బయటపడుతున్న మరిన్ని అక్రమాలు..

తవ్వేకొద్దీ బయటపడుతున్న మరిన్ని అక్రమాలు..

Loading

హైదరాబాద్, మన భద్రాద్రి వెబ్ డెస్క్: సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ సంస్థ నిర్వాహకులు ఐవీఎఫ్‌ చికిత్సకు వచ్చిన వారిని సరోగసి పేరిట మోసం చేసి డబ్బులు తీసుకున్నారని ఫిర్యాదులు అందాయి.

ఈ మేరకు గోపాలపురం పోలీసులు మరో 4 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. తమకు అందించిన మెడికల్‌ రిపోర్టులు తీసుకొచ్చి బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు.

నల్గొండకు చెందిన దంపతుల నుంచి ఫెర్టిలిటీ నిర్వాహకురాలు నమ్రత రూ.44 లక్షలు కాజేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు నమ్రత, సదానందం, చెన్నారావు, అర్చన, సురేఖపై కేసు నమోదైంది. హైదరాబాద్‌కు చెందిన బాధితురాలి ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. సరోగసి చేస్తామని బాధితురాలికి నమ్రత హార్మోన్‌ ఇంజక్షన్‌లు ఇచ్చింది. కొన్ని రోజుల తర్వాత కల్యాణి గ్యాంగ్‌ విశాఖకు పిలిచి స్పెర్మ్‌ తీసుకొని పంపింది. ఈ వ్యవహారంలో సరోగసి పేరుతో రూ.18 లక్షలు కాజేశారు. ఈ ఘటనకు సంబంధించి నమ్రత, డా.విద్యులత, కల్యాణి, శేషగిరి, శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదైంది.

ఎన్నారైలను కూడా నమ్రత గ్యాంగ్‌ మోసం చేసినట్లు ఫిర్యాదు అందింది. బాధితుల నుంచి రూ.25 లక్షలు కాజేశారు. దీంతో నమ్రతపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌కు చెందిన బాధితుల నుంచి ఈ గ్యాంగ్‌ రూ.50 లక్షలు కాజేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు నమ్రత, చెన్నారావు, సురేఖపై కేసు నమోదు చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page