![]()
-ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటన
హైదరాబాద్, మన భద్రాద్రి న్యూస్, మార్చి 09
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.శనివారం ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించింది.21 శాతం ఫిట్మెంట్ తో అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.ఇటీవల హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లి ఆర్టీసీ కళాభవన్లో 2023 – 2024 ఉత్తమ ఉద్యోగులు, అధికారులకు ఆర్టీసీ సంస్థ ఎండి సజ్జనార్ తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పురస్కారాలు అందించారు.అనంతరం మంత్రికి ఆర్టీసీ ఉద్యోగులు పీఆర్సీకి సంబంధించిన వినతి పత్రాన్ని సమర్పించారు.మంత్రి పొన్నం పీఆర్సీ అంశాన్ని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని వారికి భరోసా ఇచ్చారు.హామీ ఇచ్చిన రెండు రోజుల్లోనే ప్రభుత్వం మాట నిలబెట్టుకోవడంతో ఆర్టీసీ ఉద్యోగులు మంత్రి పొన్నంకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ, హర్షం వ్యక్తం చేశారు.


