![]()
మన భద్రాద్రి వెబ్ డెస్క్:
రెండేళ్లుగా పతనమవుతూ వస్తోన్న భారత్- కెనడా (India- Canada)ల మధ్య సంబంధాలు బలపడే దిశగా అడుగులు పడుతున్నాయి. జీ7 సదస్సుల్లో (G7 Summit) పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) కెనడా వెళ్లిన సంగతి తెలిసిందే.
ఈ పర్యటన నేపథ్యంలో ఆయన ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ (Mark Carney)తో భేటీ అయ్యారు. ఈసందర్భంగా ఇరుదేశాల సంబంధాల బలోపేతానికి సంబంధించిన కీలక అంశాలపై ఇరువురూ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా దౌత్యవేత్తల పునర్ నియామకంపై ఏకాభిప్రాయం కుదిరింది.


