![]()
-పలువురికి తీవ్ర గాయాలు
పినపాక, మన భద్రాద్రి న్యూస్, జూన్ 10
మండలంలోని సీతారాంపురం శివారులో బీటీపీఎస్ వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టగా, ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు క్షతగాత్రులను మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న ఏడూళ్ళ బయ్యారం సీఐ కరుణాకర్, ఎస్ఐ వెంకటప్పయ్య ఘటనాస్థలానికి చేరుకుని లారీ డ్రైవరుని అదుపులోకి తీసుకుని ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.


