![]()
-ఎమ్మెల్యే కోరం
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్, ఏప్రిల్ 20
రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం
విక్రయించాలని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ కోరారు. ప్రభుత్వ మద్దతు ధరతోపాటు క్వింటాకు రూ. 500 బోనస్ పొందాలని రైతులకు సూచించారు. బేతంపూడి పీఎస్పీఎస్ ఆధ్వర్యంలో టేకులపల్లి సబ్ మార్కెట్ యార్డు ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బేతంపూడి ప్యాక్స్ ఛైర్మన్ లక్కినేని సురేందర్ రావు, సొసైటీ డైరెక్టర్ ఉల్లోజు ఉదయ్, భూక్యా దేవా నాయక్, బొడ్డు అశోక్, భూక్యా రవి, శివ లాల్, తదితరులు పాల్గొన్నారు.


