![]()
- ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి ఖమ్మానికి
ఖమ్మం, మన భద్రాద్రి బ్యూరో
ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి ఈరోజు జిల్లాకు రానున్నారు. ఢిల్లీలోని 18వ లోక్ సభలో పార్లమెంట్ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశాక, జూన్ 24 నుంచి కొనసాగిన తొలి విడత పార్లమెంట్ సమావేశాల్లో పూర్తిస్థాయిలో పాల్గొని ఇక్కడికి వస్తున్నారు. తన పర్యటనలో భాగంగా తొలుత ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ జిల్లా కార్యాలయానికి వెళ్తారు. తన భారీ విజయానికి సహకరించిన పార్టీ పెద్దలు, శ్రేణులకు కృతజ్ఞతలు తెలపనున్నారు. అనంతరం ఉదయం 11:30 గంటల నుండి ఎస్ఆర్ గార్డెన్స్ సమీపంలోని బ్లూ సీ విల్లా నివాసంలో అందుబాటులో ఉంటారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వచ్చి ఎంపీ రఘురాం రెడ్డిని కలవొచ్చు. పార్టీ శ్రేణులకు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవ చేసుకుంటానని ఎంపీ ఓ ప్రకటనలో తెలిపారు.


