![]()
పలుగు, పార పట్టి ఇంకుడుగుంత తవ్విన కలెక్టర్
- తట్ట ఎత్తిన అదనపు కలెక్టర్
- ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిసి పట్టేందుకే ఇంకుడు గుంతలు
- జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్
బూర్గంపహాడ్, మన భద్రాద్రి బ్యూరో
ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిసిపట్టేందుకే ఇంకుడు గుంతలు అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల ఆవరణలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పలుగు పారా పట్టి ఇంకుడు గుంత తవ్వారు. శనివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా జల్ సoచెయ్ జెన్ భాగీ దారి లో ప్రతి ప్రభుత్వ కార్యాలయం, వసతి గృహాలు, ఆసుపత్రులు, పాఠశాలల ఆవరణలో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని చెప్పడమే కాకుండా వెంటనే పాఠశాల ఆవరణలో ఇంకుడు గుంతల నిర్మాణానికి పలుగు పారా పట్టి స్వయంగా కలెక్టర్ ఇంకుడు గుంతని తవ్వడం ప్రారంభించారు.
కలెక్టర్ వెంట ఉన్న స్థానిక సంస్థలు కలెక్టర్ విద్యా చందన, అధికారులు తట్టలతో మట్టి ఎత్తిపోశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇంకుడు గుంతల నిర్మాణానికి వేసవి కాలమే మంచి తరుణం అని, ఈ కాలంలో తవ్వుకుంటే.. వర్షాకాలం నాటికి నీటిని భూమిలోకి ఇంకించవచ్చు. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ పట్టణాలు, గ్రామాల్లో ఇంట్లో ఇంకుడుగుంత తవ్వుకుంటే మంచిది అని అన్నారు. ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిసిపట్టాలంటే ఇంకుడు గుంత తప్పని సరిగా నిర్మించాలి అన్నారు. ఇంకుడు గుంత యొక్క కొలతలు ఒకటి మీటర్ వెడల్పు ఒక మీటర్ పొడవు, ఒక మీటర్ లోతు తో ఒక గుంటను తీసి అందులో అందుబాటులో దొరికే శిధిలాల వ్యర్ధాలు, చిన్న చిన్న రాళ్ళను నింపితే సరిపోతుందన్నారు. పాఠశాల ప్రాంగణం అంతా పరిశీలించి పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, పాఠశాల భవనం ఎక్కడైనా లీకేజీ ఉన్నాయా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణలో ఒక డార్మెటరీ హాలు మరియు రెండు తరగతి గదులు జన్మించడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని సిపిఓ సంజీవరావు ను ఆదేశించారు. ఇంకా ఏమైనా పాఠశాలల్లో చేయవలసిన మరమత్తులు, పరిష్కరించాల్సిన సమస్యలను నివేదిక అందించాలని పాఠశాల తరఫున ప్రారంభం నాటికి అన్ని సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పదవ తరగతి పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించినందుకు గాను ప్రిన్సిపల్ గీత జ్యోతి ని కలెక్టర్ అభినందించారు. మండల పర్యటనలో భాగంగా తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాలుర ఉన్నత పాఠశాల, మరియు జూనియర్ కాలేజ్, మోరంపల్లి బంజర లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నాగినేనిప్రోలు లోని హై స్కూల్ మరియు అంగన్వాడీ సెంటర్లను కలెక్టర్ స్వయంగా పలుగు, పారా పట్టి ఇంకుడు గుంతను తవ్వి అందరిని ప్రోత్సాహించారు.
అనంతరం కలక్టర్ నాగినేనిప్రోలు పంచాయతీలోని నర్సరీని పరిశీలించి లక్ష్మీపురంలోని ఉపాధి హామీ ద్వారా మునగ సాగును కూడా పరిశీలించి చాలా బాగుందని మెచ్చుకున్నారు. సారపాక లోని పాఠశాల పిల్లల ఏకరూప దుస్తుల తయారీ కేంద్రం ని పరిశీలించి మే నెల చివరి నాటికి ఏకరూప దుస్తుల తయారీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ముజాహిద్, ఎంపీడీవో జమలా రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి యదు సింహరాజు, ఇన్చార్జి ఎంపీఓ బాలయ్య, ఎన్ఆర్ఈజీఎస్ ఏపీవో విజయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


